9 May, 2026 | 1:58 AM

రావు బహదూర్ వేంచేస్తున్నారహో!

09-05-2026 12:26 AM

సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. ప్రముఖ దర్శకుడు వెంకటేశ్ మహా దర్శకత్వం వహిస్తూ కథ, ఎడిటింగ్ బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్‌ల జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాయి.  తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయిక.

వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కార్తిక్ పరమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, స్మరణ్‌సాయి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను రోహన్ సింగ్ నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే, రామ్‌చరణ్ ‘పెద్ది’ జూన్ 4న వస్తోంది. ఆ సినిమా కంటే ఒకరోజు ముందు రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి థియేటర్ల లభ్యతపై సంగ్ధిత నెలకొంది.