9 May, 2026 | 2:01 AM

రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్య

09-05-2026 12:43 AM
  1. చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఘాతుకం
  2. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో ఘటన
  3. నేపాల్‌కు చెందిన పనిమనిషిపై అనుమానాలు
  4. నిందితుల కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు

జూబ్లీహిల్స్, మే 8 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గురువారం అర్ధరాత్రి రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్యకు గురైంది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే తన భార్య తనూజ (55), పిల్లలతో కలిసి రోడ్ నంబర్ 72లోని ప్రశాసన్ నగర్‌లో నివాసముంటున్నారు. గురువారం రాత్రి తనూజ సొంతింటిలోనే హత్యకు గురైంది.

విన య్ రంజన్ ఇంట్లో లేకపోవడంతోపాటు ఆయన పిల్లలు మేడపై నిద్రిస్తుండటాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని తెలుస్తోంది. శుక్రవారం సీపీ సజ్జనార్ ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడారు. నిందితులు ఇంటి వెనుక గేట్ నుంచి లోపలికి ప్రవేశించి, హత్య చేసిన తర్వాత ఇంట్లోని నగదు, బంగారంతో అదే మార్గంలో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దుం డగులు అత్యంత క్రూరంగా తనూజను అం తమొందించారని పోలీసులు అనుమానిస్తున్నారు. చేతులు కట్టేసి, కేకలు వేయ కుండా నోట్లో గుడ్డలు కుక్కి ఆమెకు ఊపిరాడకుం డా చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.

ఇది పక్కా ప్రణాళిక తోనే.. నేపాలీ గ్యాంగ్ చేసిన చర్యగా అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇం ట్లో పనిమనిషిగా ఉన్న కల్పన  మరో ఇద్దరితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీపీ  వెల్లడించారు. తనూజను హత్య చేసిన అనంతరం ఇంట్లోని బంగారం, నగదు తీసుకుని ముగ్గురు నిందితులు పరారైనట్టు గు ర్తించారు.

పది ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తునట్టు సీపీ తెలిపారు. లఖ్‌నవూ, ముంబై, నేపాల్ సరిహద్దుకు ఆ యా బృందాలు బయల్దేరాయని చెప్పారు. హత్య అనంతరం నిందితులు నాంపల్లికి ఆ టోలో వెళ్లి అక్కడినుంచి తెలంగాణ ఎక్స్‌ప్రె స్ ఎక్కి వెళ్లిపోయినట్లు  నిర్ధారించారు.

నేపాల్ పనిమనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్

నేపాల్ నుంచి వచ్చే కొందరు నేరాలకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ అన్నారు. వారిని పనిలో పెట్టుకునే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇంట్లో ఏడా ది, రెండేళ్లు పనిచేసినా సరే.. వారిపై నిఘా ఉంచాలని స్పష్టంచేశారు. యజమానులు ఇంట్లో లేని సమయం కోసం వారు వేచి చూస్తుంటారని సీపీ తెలిపారు.

ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటారన్నారు. పనిమనుషులను నియమించుకునే టప్పుడు వారి పూర్తి వివరాలను స్థానిక పో లీస్ స్టేషన్‌లో నమోదు చేయడం తప్పనిసరి అని స్పష్టంచేశారు. బెంగళూరు, ముంబా యి, పుణెలో నేపాలి ముఠాలు నేరాలకు పా ల్పడుతున్నట్లు చెప్పారు.