తమిళనాట తికమక!
టీవీకే నేత విజయ్ ప్రమాణస్వీకారంపై తొలగని అనిశ్చితి
- చిన్నాచితక పార్టీల గందరగోళం
- దళపతికి కాంగ్రెస్‌తో పాటు లెఫ్ట్ మద్దతు
- 116 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముచ్చటగా మూడోసారి గవర్నర్‌తో విజయ్ భేటీ
- మద్దతుపై వీసీకే సందిగ్ధం.. నేడు తుది నిర్ణయం
- మద్దతిచ్చిన పార్టీలకు మంత్రిపదవులు ఆఫర్ చేసిన టీవీకే
- నేడు ప్రమాణ స్వీకారోత్సవం జరిగేనా!?
పార్టీల వారీగా ఇలా..
టీవీకే 107
కాంగ్రెస్ 5
సీపీఐ 2
సీపీఎం 2
మొత్తం 116
చెన్నై, మే 8: తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుపై తొలగని అనిశ్చితి.. రాజకీయ పార్టీల కుప్పిగంతులు.. శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు క్షణక్షణం రాజకీయ ట్విస్టులు కొనసాగాయి. విజయ్‌కి తొలుత కాంగ్రెస్.. తర్వాత సీపీఐ, సీపీఎం, వీసీకే, చివరికి డీఎంకే మిత్రపక్షమైన ఐయూఎంఎల్ కూడా మద్దతు ప్రకటించాయి. టీవీకేకు మ్యాజిక్ ఫిగర్ 118 దాటి 120కి చేరింది. దీంతో శుక్రవారం సాయంత్రం విజయ్ లోక్‌భవన్ కు వెళ్లి మూడోసారి గవర్నర్‌ను కలిశా రు.
దీంతో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు టీవీకే అధినేత విజయ్‌కి గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. విజయ్ శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని సీపీఎం నేత కే బాలకృష్ణన్ వెల్లడించారు. అయితే మద్దతుపై టీవీకే నుంచి గానీ, ప్రభుత్వ ఏర్పాటుపై లోక్‌భవన్ నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలే దు. దాంతో సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంపై సందిగ్ధత అర్ధరాత్రి దాటినా వీడలేదు. ఇదిలా ఉంటే వీసీకే మొదట టీవీకేకు మద్దతిచ్చినట్లే ఇచ్చి ట్విస్ట్ ఇచ్చిం ది.
లేఖను మెయిల్ ద్వారా పంపామని ట్వీట్ చేసింది. తుదినిర్ణయం శనివారం వెల్లడిస్తామని మరో పోస్టులో పేర్కొంది. ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇవ్వలేదని ప్లేట్ ఫిరాయించింది. మరోపక్క ప్రభుత్వ ఏర్పాటుకు ఏఐఏడీఎంకేను ఆహ్వానించాలని గవర్నర్‌ను.. ఒక్క సీటు ను సాధించిన ఏఎంఎంకేకు నేత టీటీవీ దినకరన్ కోరారు. మరోవైపు తమ నాయకుడు విజయ్ సీఎం కాబోతున్నారని ఆనందంతో టీవీకే కార్యకర్తలు, ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
తమిళనాడులో టీవీకే అధినేత విజ య్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎం, వీసీకే నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. లెఫ్ట్‌పార్టీలు, కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో టీవీకే బలం 120కి చేరనుంది. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లు సాధించింది. అయితే, అందులో విజయ్ రెండు చోట్లా గెలవడంతో సంఖ్యాబలం 107గా మారింది.
మద్దతిచ్చిన పార్టీలకు మంత్రిపదవులు ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు రెండు, సీపీఐ, సీపీఎం, వీసీకేకు ఒక్కో మంత్రిపదవి చొప్పున కేటాయించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే డీఎంకే మిత్రపక్షమైన ఐయూఎంఎల్ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చి, కొద్దిసేపటికే తాము ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే తనకు మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు విజయ్ వెళ్లి, ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
టీవీకేకు బయటి నుంచే తాము మద్దతిస్తామని, ప్రభుత్వంలో చేరబోమని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. టీవీకే అధినేత విజయ్ 116 సంతకాలతో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిశారు. వీసీకే, ఐయూఎంఎల్ నుంచి మద్దతు లేఖలు ఇంకా రాలేదని, శనివారం విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై కూడా గందరగోళం నెలకొందని లోక్‌భవన్ వర్గాలు శుక్రవారం రాత్రి పేర్కొన్నాయి.
నేడేనా ప్రమాణ స్వీకారోత్సవం?
శనివారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని సీపీఎం నేత కే బాలకృష్ణన్ తెలిపారు. మరోపక్క లోక్‌బన్ నుంచి స్పష్టమైన నిర్ణయం రాలేదు. తమకు 116 మంది ఎమ్మెల్యేల సంతకాలతోనే విజయ్ కలిశారని పేర్కొన్నాయి. ఇంకోపక్క వీసీకే డిప్యూటీ సీఎం కావాలని పట్టుపట్టినట్లు తెలిస్తోంది. దీంతో వీసీకే మద్దతుపై కూడా సందిగ్ధం నెలకొంది. మరోపక్క ప్రమాణస్వీకారానికి కాం గ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిణామాలతో ప్రమాణ స్వీకారం ఎప్పుడనే దానిపై అనిశ్చితి నెలకొంది.
గవర్నర్‌కు స్టాలిన్ వినతి
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడి, అసెంబ్లీ రద్దయ్యాక కూడా కొత్త ప్రభు త్వ ఏర్పాటు కాకపోవడాన్ని ప్రశ్నిస్తూ గవర్నర్‌ను ఉద్దేశించి డీఎంకే అధినేత స్టాలిన్ శుక్ర వారం ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని, ప్రస్తుత శాసనసభ ఇప్పటికే రద్దు అయిందని, గవర్నర్ ఆ మేరకు ప్రకటన కూడా జారీ చేశారని గుర్తుచేశారు.
ఇటు వంటి పరిస్థితులలో, ఎన్నికైన శాసనసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడానికి, రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది కేవలం కాలపు అవసరం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన కర్తవ్యం కూడా అని స్టాలిన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో, ద్రవిడ మున్నేట్ర కజగం తరఫున(డీఎంకే), ప్రభుత్వ ఏర్పాటులో ఎటు వంటి జాప్యం జరగకుండా నివారించడానికి, రాజ్యాంగం ప్రకారం ఒక కొత్త పరిపా లనను ఏర్పాటు చేయడానికి గవర్నర్ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే శుక్రవారం విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతిస్తారని అనుకున్నట్లు తెలిపారు.
ఏఐఏడీఎంకేను ఆహ్వానించండి: టీటీవీ
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏఐఏడీఎంకేను ఆహ్వానించాలని గవర్నర్‌ను ఏ ఎంఎంకేకు చెందిన టీటీవీ దినకరన్ శుక్రవారం అర్ధరాత్రి కోరారు. తదుపరి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏఐఏడీఎంకే నేత, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామిని ఆహ్వానించాలని దినకరన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖను షోల్‌మీడియాలో పోస్టు పెట్టారు. అనంతరం గవవర్నర్‌తో భేటీ అయిన టీటీవీ దినకరన్, ఏఐఏడీఎంకేతో కొనసాగుతామని స్పష్టం చేశారు.
టీవీకేకు మద్దతు లేఖ ఇవ్వలేదు: ఐయూఎంఎల్
తమిళనాడులో క్షణక్షణం రాజకీయం సరికొత్త మలుపులు తొక్కుతోంది. గవర్నర్‌కు శుక్రవారం అర్ధరాత్రి వరకు కూడా వీసీ కే మద్దతు లేఖ చేరలేదు. మరోపక్క టీవీకేకు మద్దతు లేదని ఐయూఎంఎల్ ఖండించిం ది. ‘మేము ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. నేను ఎవరికీ ఎలాంటి లేఖలు ఇవ్వలేదు. ఇది కేవలం ఒక వదంతి. మేము డీఎంకే నాయకత్వంలో పొత్తును కొనసాగిస్తున్నాం. మేము డీఎంకే పొత్తుతోనే కొనసాగుతున్నాం’ అని ఐయూఎంఎల్ నాయకుడు ఏఎం షాజహాన్ తెలిపారు.
డిప్యూటీ సీఎం డిమాండ్ చేసిన వీసీకే చీఫ్?
టీవీకే అధినేత విజయ్ ఇంటికి వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ వెళ్లి, ఆయనతో చర్చలు జరిపారు. అయితే వీసీకే పార్టీ అధినేతకు విజయ్ పార్టీ నుంచి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు తమిళ మీడియా పేర్కొంది. ఏమిటంటే టీవీకే ప్రభుత్వానికి వీసీకే మద్దతు ఇస్తే విజయ్ రాజీనామా చేసే తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ టికెట్ వీసీకే అధినేతకు కేటాయించడానికి టీవీకే ఆఫర్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ స్థా నంలో వీసీకే అధినేత తిరుమావళవన్ గెలిస్తే డిప్యూటీ సీఎం పదవిని ఆ పార్టీ డి మాండ్ చేసింది.
అయితే, ఆ పార్టీకి ‘పట్టణాభివృద్ధి’ శాఖను అప్పగించడానికి టీవీ కే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే శుక్రవారం అర్ధరాత్రి వీసీకే మద్దతుపై సం దిగ్ధం నెలకొంది. దీంతో వీసీకే చీఫ్ తోల్ తిరుమావళవన్ అందుబాటులో లేరు. విజయ్ నేతృత్వంలోని టీవీకే రాత్రి దాదా పు రెండు గంటలుగా ఆయనను సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందించన ట్లు సమాచారం. మరోపక్క ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తున్నట్లు వీసీకే తెలిపింది.
ఈ మెయిల్ ద్వారా తమ లేఖను పంపినట్లు వెల్లడించింది. ఈ మేరకు వీసీకే పార్టీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. తమ మద్దతకు సం బంధించి అధికారిక ప్రకటన శనివారం చేస్తామని మరో ట్వీట్‌లో పేర్కొంది. వీసీ కే, టీవీకే శ్రేణులంతా సంయమనం పా టించాలని కోరింది. ఇదిలా ఉంటే టీవీకే 108 స్థానాల్లో గెలిచినప్పటి నుంచి కూడా తిరుచ్చి ఈస్ట్ సీటు నుంచి సినీనటి త్రిష పోటీ చేస్తుందని, ఆమెకు టీవీకే అధినేత విజయ్ డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని సోషల్ మీడియాలో పోస్టులు, కథనాలు వైరల్ అవుతుండడం గమనార్హం.






