calender_icon.png 7 February, 2026 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డు అభివృద్ధి నా లక్ష్యం.. దీవించండి సాత ప్రవీణ్ కుమార్

07-02-2026 12:11:46 AM

శంకర్‌పల్లి, ఫిబ్రవరి ౬ (విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే, వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సాత ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన సాయి నగర్, అయ్యప్ప రెడ్డి గూడా కాలనీలలో తన కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అభివృద్ధే నా నినాదం..

ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ప్రవీణ్ కుమార్, ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ప్రస్తావించారు: తన సతీమణి గతంలో కౌన్సిలర్గా ఉన్నప్పుడు వార్డులో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు.సాయి నగర్, అయ్యప్ప రెడ్డి గూడా కాలనీలలో ప్రధానంగా ఉన్న మంచినీటి సమస్యను, వీధి దీపాల సమస్యను పరిష్కరించినట్లు వివరించారు.

అయ్యప్ప రెడ్డి గూడా ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకొని, విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, స్టేషనరీ అందిస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడ్డామని తెలిపారు. ఓటు వేసి తను నాకు మద్దతిస్తే  వార్డును మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దే అవకాశం నాకు ఇవ్వండి.

మీ సమస్యల పరిష్కారమే నా ప్రధమ ప్రాధాన్యత ఆయన పేర్కొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సహకారంతో ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు మంజూరు చేయించి, వార్డులో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ప్రవీణ్ కుమార్కు మద్దతు తెలిపారు.