calender_icon.png 7 February, 2026 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13వ వార్డులో ‘లావణ్య’ ప్రభంజనం

07-02-2026 12:13:10 AM

అభివృద్ధి నినాదంతో ఇంటింటికీ కాంగ్రెస్ అభ్యర్థి

మొయినాబాద్, ఫిబ్రవరి 6(విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ 13వ వార్డులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న యాలాల లావణ్య జైపాల్ రెడ్డి తన ప్రచారంతో వార్డులో దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా కార్యకర్తలతో కలిసి ఆమె నిర్వహిస్తున్న ‘ఇంటింటి ప్రచారం‘కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.యువతే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం గా ఆమె ఓటర్లతో మమేకమైతు  ముందుకు వెళుతుంది. ప్రచారంలో భాగంగా లావణ్య జైపాల్ రెడ్డి ప్రతి గడపకూ వెళ్లి, ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విజన్ గురించి కొన్ని కీలక హామీలు ఇచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతీ యువకుల కోసం వార్డులో అత్యాధునిక వసతులతో కూడిన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తానని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పేద విద్యార్థులు చదువులో రాణించేందుకు తన వంతుగా వ్యక్తిగత ఆర్థిక సహాయం చేస్తానని హామీల వర్షం గుప్పించారు.

వార్డు పరిధిలో మౌలిక సదుపాయాలు డ్రైనేజీ, తాగునీరు మరియు వీధి దీపాల సమస్యల శాశ్వత పరిష్కారం చేస్తానన్నారు.ప్రజల మనిషిగా ఉంటాను..‘నాపై నమ్మకం ఉంచి ’చేయి’ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే, మీ సమస్యలను తీర్చే బాధ్యత నాది. నేను కేవలం ఓట్ల కోసం వచ్చే నాయకురాలిని కాదు, మీ ఇంట్లో మనిషిలా ఉండి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాను‘ అని లావణ్య జైపాల్ రెడ్డి ఉద్వేగంగా పిలుపునిచ్చారు.

వార్డులోని మహిళలు ఆమెకు మంగళహారతులతో స్వాగతం పలుకుతుండటం, యువత పెద్ద ఎత్తున మద్దతు తెలపడం చూస్తుంటే 13వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని స్థానిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.