26 June, 2026 | 2:29 AM

డ్రగ్స్ నిర్మూలనకు విద్యార్థులు, యువత ముందుకు రావాలి

26-06-2026 12:00 AM

గోవిందరావుపేట, జూన్ 25 (విజయక్రాంతి):మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించే లక్ష్యంతో గురువారం సెయింట్ మే రీస్ హై స్కూల్ లో డ్రగ్స్ పసర సీఐ దయాకర్ పర్యవేక్షణలో ఎస్‌ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో డ్రగ్స్ వినియోగం వ ల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ వాల్ పోస్టర్లను విడుదల చేశారు.

అనంతరం పాఠశా ల గోడలపై డ్రగ్స్ వ్యతిరేక సందేశాలతో వాల్ పోస్టర్లు అంటించి, వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని పోలీసు అధికారులు వివరించారు. ఎస్‌ఐ తాజుద్దీన్ మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అ నుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూ చించారు. విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి సారించి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  కరస్పాండెంట్లు పెంటా రెడ్డి, స్టీఫెన్ రెడ్డి, ప్రిన్సిపాల్ వేణు, ఉపాధ్యాయ, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.