11 May, 2026 | 7:21 PM

లైవ్ లొకేషన్ తప్పుదారి పట్టిస్తే వేతనాలు కట్

11-05-2026 06:17 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి సమయపాలన పాటిస్తూ లైవ్ లొకేషన్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ లో ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రతి శాఖలో ప్రగతి పురోగతి కనిపించాలని పేర్కొన్నారు. కొందరు అధికారులు లైవ్ లొకేషన్ పక్కదారి పట్టించి కుంటి సాకులు చెప్తున్నారని ఎక్కడ ఉన్నా లొకేషన్ చేయాలని హెచ్చరించారు.

100% లొకేషన్ ఉంటేనే జూన్ నెలలో వేతనాలు ఇస్తామని లేకుంటే వేతనాలు నిలుపుదల చేస్తామని ఏమైనా ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తేవాలని పేర్కొన్నారు. అధికారులు సెలవుల పేరుతో విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి అధికారులు సమిష్టిగా పని చేయవలసిన అవసరం ఉందని క్రింది స్థాయిస్థాయి సిబ్బంది కూడా పని చేయించుకోవాలని హెచ్ఓడీలు ఆఫీస్ పర్యవేక్షణ పకడ్బందీగా నిర్వహించాలని ఎవరికి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సిబ్బంది ఉన్నారు