ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు అండగా నిలబడాలి
- పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అధ్యక్షతన శిక్షణ శిబిరం
కోదాడ, జాన్ 14 : ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ఓటర్లకు అండగా నిలబడాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణం గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ ఆవరణలో ఎమ్మెల్యే పద్మావతి అధ్యక్షతన కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల బూత్ లెవల్ ఏజెంట్లకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలం తర్వాత ఎస్ ఐ ఆర్ ప్రక్రియ జరుగుతుందన్నారు.
అధికారులు అడిగిన పత్రాలను నిరక్షరాస్యులైన ఓటర్లు అందించలేరని, వారికి బూత్ లెవల్ ఏజెంట్లు అండగా నిలబడి, అవసరమైన పత్రాలను సమకూర్చిపెట్టి అధికారులకు సకాలంలో అందించి, ఓటు హక్కుపై ప్రభావం పడకుండా చూసుకోవాలన్నారు. పేద, నిరక్షరాస్య ఓటర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తరపున బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకట్, రాజేష్, నర్సయ్య, , మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లాగ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ హుజూర్నగర్, నియోజక వర్గాల నాయకులు పాల్గొన్నారు.






