15 June, 2026 | 4:54 AM

మల్దకల్లో బీఎల్‌ఏలకు బీఆర్‌ఎస్ దిశానిర్దేశం

15-06-2026 12:00 AM

మల్దకల్, జూన్ 14: గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొని బీఎల్‌ఏలకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డి. శేఖర్ నాయుడు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల వివరాలను పరిశీలించి ఓటు హక్కు పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. డబుల్ ఓట్ల తొలగింపుతో పాటు అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.