13 May, 2026 | 12:58 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్

13-05-2026 12:04 PM
  1. ఆసక్తికరంగా విజయ్ బలపరీక్ష
  2. తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా 
  3. రెబెల్‌ ఎమ్మెల్యే వేలుమణికి అవకాశం ఇవ్వడంపై ఆగ్రహం
  4. ప్రజా తీర్పును గౌరవించి TVKకు మద్దతిస్తున్నాం:వేలుమణి

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బల పరీక్ష జరిగింది. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో బల పరీక్ష తీర్మానాన్ని ప్రతిపాదించారు. విజయ్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. 144 మంది ఎమ్మెల్యయేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. 22 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. తమిళనాడు అసెంబ్లీలో చర్చ అనంతరం ఓటింగ్ జరిగింది. తాజాగా విజయ్ కు అన్నాడీఎంకేలోని దాదాపు 30 మంది మద్దతు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంల్ పార్టీలు విజయ్ మద్దతిచ్చారు.

తమిళనాడు రాజకీయాలు మరియు ప్రాంతీయ వార్తలపై పూర్తి వివరాల కోసం తమిళనాడు పేజీని సందర్శించండి.

గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం: విజయ్

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడుతూ... మాకు మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. టీవీకే ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని విజయ్ పేర్కొన్నారు. మా ప్రభుత్వ లౌకిక విధానం అవలంబిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని విజయ్ వెల్లడించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. మాకు ఓటు వేయని వాళ్ల కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అందరికీ సామాజిక న్యాయాన్ని అందించే బాధ్యత తమదన్నారు.

డీఎంకే, అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం వాకౌట్

విజయ్ సర్కార్ బలపరీక్ష సమయంలో డీఎంకే, అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం వాకౌట్ చేసింది. దీంతో విజయ్ బల పరీక్ష ఆసక్తికరంగా మారింది. స్పీకర్ ఒక్కో సభ్యుడి మద్దతు అడిగి తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలను పేర్లతో పిలిచి సమ్మతి నమోదు చేస్తున్నారు. స్పీకర్ మూజువాణి, ఓటింగ్ కాకుండా బలపర్చినవాల్ల మద్దతు తీసుకున్నారు. సభలో ఎమ్మెల్యేలు లేచినిలబడి విజయ్ కి మద్దతు తెలుపుతున్నారు.

దేశవ్యాప్తంగా తాజా రాజకీయ, జాతీయ వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ బలపరీక్ష నెగ్గారు. విజయ్‌కు వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేల ఓటు వేయగా, అసెంబ్లీ నుంచి 61 మంది ఎమ్మెల్యేల వాకౌట్ చేశారు. బలపరీక్ష సమయంలో అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యుల వాకౌట్ చేశారు. బలపరీక్షకు ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో హైడ్రామా కొనసాగింది. రెబెల్‌ ఎమ్మెల్యే వేలుమణికి అవకాశం ఇవ్వడంపై అన్నాడీఎంకే-పళనిస్వామి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారన్న పళనిస్వామి మండిపడ్డారు. దీనిపై స్పందించిన వేలుమణి ప్రజాతీర్పును గౌరవించి TVKకు మద్దతిస్తున్నామని పేర్కొన్నారు.

దేశ రాజకీయాల్లో జరుగుతున్న తాజా పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ కోసం మా పాలిటిక్స్ విభాగాన్ని చూడండి.

విజయ్ కీలక వ్యాఖ్యలు

బలపరీక్ష అనంతరం సీఎం విజయ్ మాట్లాడుతూ:

“మాకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు”

“TVK ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు అధికారంలో ఉంటుంది”

“గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం”

“మహిళల భద్రత, సామాజిక న్యాయం మా ప్రధాన లక్ష్యాలు”