29 August, 2026 | 4:44 AM

అప్రమత్తతే దొంగతనాలకు అడ్డుకట్ట

29-08-2026 02:28 AM

పెబ్బేరు, ఆగస్టు 28: రద్దీ ప్రాంతాలు, బస్సులు, బస్టాండ్లు, మార్కెట్లలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నగదు, ఆభరణాలు, మొబైల్ ఫోన్లు వంటి విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని తెలిపారు. బ్యాగులను ముందుభాగంలో ఉంచుకుని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎటిఎం పిన్ , ఓటీపీ వంటి రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. చిన్నపాటి నిర్లక్ష్యాన్ని నివారించి ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు.