29 August, 2026 | 3:02 AM

పోరుబాట

29-08-2026 02:00 AM

కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి

సెప్టెంబర్ 2నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు

  1. ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ఎండగట్టాలి
  2. అమలైన హామీలు, బాకీ ఎన్ని? ప్రజలకు వివరించండి
  3. బాకీ కార్డులతో ఇంటింటి ప్రచారం చేయాలి
  4. పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
  5. టెలీకాన్ఫరెన్స్ ద్వారా నేతలకు దిశానిర్దేశం

1న చార్జిషీట్

* వారం రోజుల కార్యాచరణకు ముందుగా సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వంపై చార్జిషీట్ విడుదల చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచుతామని చెప్పారు. సెప్టెంబర్ 2న కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారం టీ అమలు వైఫల్యాన్ని నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని కోరారు.

హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఫ్లెక్సీలు ప్రదర్శించ డంతో పాటు 420 హామీల అంశాన్ని  ప్రధానంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇంకా అమలు చేయాల్సిన హామీలను ప్రజలకు తెలియజేసేలా ప్రత్యేకంగా రూపొందించిన బాకీ కార్డు లను ఇంటింటికీ పంపిణీ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 3న రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తం గా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

రైతులు, వ్యవసాయదారులు, రైతుకూలీల కు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రైతు సదస్సులు నిర్వహించాలని తెలిపా రు.వ్యవసాయం, సాగునీరు, విద్యు త్, యూరియా, పంటల బీమా వంటి కీలక అంశాలపై రైతులతో చర్చించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పారు.

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల అసమర్థ పాలన, హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ పోరుబాట పట్టనుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Party Working President KTR) తెలిపారు. సెప్టెంబర్ 2నుంచి వరుసగా వారం రోజుల పాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కేటీఆర్ శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి నిర్వహణ తీరుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి న వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. వెయ్యి రోజు లు దాటినా పూర్తిస్థాయిలో నెరవేర్చడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన కాం గ్రెస్ వైఖరిని ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌పై ఉందన్నారు. 

పార్టీ నిర్ణయించిన కార్యాచరణను కేవలం నిరసన కార్యక్రమాలకే పరిమితం చేయకుండా..  కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమిటి? వాటి లో ఎన్ని అమలయ్యాయి? ఇంకా ఎన్ని హామీలు బాకీ ఉన్నాయి? ప్రతి ఇంటికీ చేరేలా ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతి నాయకుడు తన కార్యక్షేత్రంలో బాధ్యత తీసుకొని ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగ ట్టాలని కోరారు.   

22 ఏ జాబితాపైనా నిరసనలు..

హైదరాబాద్‌తో పాటు అర్బన్ ప్రాంతా ల్లో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న 22 ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై ప్రత్యేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 4న మహిళలు, వికలాంగులు తదితర వర్గాలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తులం బంగారం వంటి అంశాలతోపాటు ఇతర సంక్షేమ హామీల అమలు పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో వినూత్నంగా వంటావార్పు వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సెప్టెంబర్ 5న విద్యార్థులు, యువత సమస్యలపై ప్రత్యేకంగా పోరాట కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్, ఉద్యోగాల కల్పనతోపాటు యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువతతో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ఆదిలాబాద్‌లో సీసీఐ సమస్యలు, సింగరేణి ప్రాంతాల్లో ఆయా వర్గాల సమస్యలపై ప్రత్యేక నిరసన సదస్సులు నిర్వహించాలని సూచించారు.

సెప్టెంబర్ 6న హైదరాబాద్లో నగర సమస్యలపై ఆటోలతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. తాగునీరు, వీధిదీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖానాల నిర్వహణ వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.

అదేరోజు మిగిలిన నియోజకవర్గాల్లో పల్లెల పరిస్థితి, పడకేసిన పారిశుద్ధ్య వ్యవస్థ, గ్రామీణ ప్రాంతాల సమస్యలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సెప్టెంబర్ 7న జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తిని వ్యక్తం చేసే వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. అన్ని జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యం, ప్రజలకు జరిగిన మోసంపై ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. 

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్‌మీట్లు

వారం రోజుల కార్యక్రమాల అనంతరం సెప్టెంబర్ 8న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు నిర్వహించి, ఆయా జిల్లాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలు, ప్రజల నుంచి వచ్చిన స్పందన, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని సూచించారు. అదే సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని తెలిపారు. సెప్టెంబర్ 10న జరగనున్న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు కూడా బీఆర్‌ఎస్ సంఘీభావం ప్రకటించాలని కేటీఆర్ సూచించారు.

పార్టీ చేపట్టనున్న ఈ వారం రోజుల కార్యాచరణను విజయవంతం చేయడంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు విస్తృతంగా, ప్రజల భాగస్వామ్యంతో, సాధ్యమైనంత వినూత్నంగా నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలోని వైఫల్యాలు, అమలు కాని హామీలు,

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ మొత్తం కార్యక్రమాలను పార్టీ కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని కేటీఆర్ తెలిపారు. ప్రతి కార్యక్రమంపై నివేదికలు తీసుకోవడంతోపాటు పార్టీ కేడర్ను

అప్రమత్తం చేసి నాయకులకు అవసరమైన మార్గదర్శకాలు అందజేస్తామని చెప్పారు. పార్టీ నిర్దేశించిన కార్యాచరణను ప్రతి ఒక్కరూ తమ తమ కార్యక్షేత్రాల్లో విజయవంతం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.