29 August, 2026 | 4:41 AM

బీసీ, ఈబీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్

29-08-2026 02:40 AM

విదేశాల్లో ఉన్నత విద్యకు సువర్ణావకాశం

1 నుంచి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం(Mahatma Jyotiba Phule BC Overseas Vidyanidhi Scheme) ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు సువర్ణ అవకాశం కల్పిస్తోంది. 2026 ఆగస్టు/ సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు కొనసాగనుంది. ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనుండగా, అందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారు.

విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్/ పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసి స్తు న్న లేదా అభ్యసించాలనుకుంటున్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి  సూచించారు. కుటుంబ వార్షిక ఆదాయం  రూ.5 లక్షల లోపు,  వయస్సు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు, జీఆర్ ఈ లేదా జీమ్యాట్0 స్కోర్ కలిగి న, టోఫెల్ మార్కులు, లేదా ఐఈఎల్‌టీ ఎస్ లేదా పీటీఈ మార్కులు స్కోర్ ఏదైనా కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు.