కార్యదర్శుల ఇంటిబాట!
- కార్యాలయాల్లో అందుబాటులో ఉండరంటూ గ్రామస్తుల ఆరోపణలు..
- ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన
బోధన్, ఆగస్టు 23 (విజయ క్రాంతి): బోధన్, సాలూర మండలాల్లోని పలు గ్రామపంచాయతీల్లో గ్రామపంచాయతీ కార్యదర్శులు (Gram Panchayat Secretaries) మధ్యాహ్నానికే కార్యాలయాల నుంచి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధి నిర్వహణ సమయంలో కార్యాలయాల్లో కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామాల్లో ఇంటి పన్నులు, ఇతర పంచాయతీ కార్యక్రమాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు తదితర అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిపై కార్యదర్శులు తగిన స్థాయిలో దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల గ్రామాల్లో కొత్త సర్పంచులు కొలువుదీరిన నేపథ్యంలో గ్రామాల సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకుని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పంచాయతీ పరిపాలనను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అయితే మధ్యాహ్నం సమయానికే కార్యాలయాల నుంచి వెళ్లిపోతుండటంతో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు కనిపించకపోవడం పట్ల గ్రామస్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కార్యదర్శులను మధ్యాహ్నం తర్వాత కార్యాలయంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నిస్తే.. గ్రామంలో పనులు లేవని, ఇంటికి వెళ్తున్నామని లేదా మండల కార్యాలయంలో పని ఉందంటూ వివిధ కారణాలు చెబుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి?
బోధన్ మండలంలోని రాజీవ్ తండా, ఊటుపల్లి, ఆమ్దాపూర్, ఎరాజ్పల్లి, బెల్లాల్ గ్రామాలతో పాటు సాలూర మండలంలోని కుమ్మన్పల్లి, జడ్జమాల్పూర్, మందర్న, ఖాజాపూర్, హూంసా గ్రామాల్లోనూ కార్యదర్శులు మధ్యాహ్నానికే ఇంటిబాట పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఊటుపల్లి గ్రామ కార్యదర్శి ఆగస్టు 15 రోజున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఊట్పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి 9 గంటలకు జండా ఆవిష్కరణకు దర్శనమిచ్చారు.
గ్రామపంచాయతీ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు జనన, మరణ ధ్రువపత్రాలు, ఇంటి పన్నులు, ఇతర పంచాయతీ సంబంధిత పనులు ఉంటాయని, కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో పనుల కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
గ్రామపంచాయతీ కార్యదర్శులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కార్యాలయాల్లో కార్యదర్శుల హాజరు, విధుల నిర్వహణపై పర్యవేక్షణ చేపట్టి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మధ్యాహ్నం తర్వాత కార్యదర్శులు కార్యాలయాల్లో ఎందుకు అందుబాటులో ఉండటం లేదనే అంశంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని, విధుల్లో నిర్లక్ష్యం ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి ఇంటిని ఆన్లైన్లో నమోదు చేయడానికి డబ్బులు డిమాండ్
మాకూర్ మండలంలోని గొట్టుముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గొట్టుముక్కులకు చెందిన ముప్పడి రాజేందర్ తన ఇంటిని ఆన్లైన్లో నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శి కట్కం మోహన్ను కోరాడు. దీనికి పంచాయతీ కార్యదర్శి రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను అంతగా ఇచ్చుకోలేనని తగ్గించాలని కోరడంతో రూ.18 వేలకు ఒప్పందం కుదిరింది.
ఈమేరకు బుధవారం పంచాయతీ కార్యాలయంలో ఉన్న కార్యదర్శి మోహన్కు బాధితుడు రాజేందర్ రూ.18వేలు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మోహ్ప కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. మధ్యాహ్నం తర్వాత కార్యదర్శులు కార్యాలయాల్లో ఎందుకు అందుబాటులో ఉండటం లేదనే అంశంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని, విధుల్లో నిర్లక్ష్యం ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు






