29 August, 2026 | 4:40 AM

కేంద్ర మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

29-08-2026 02:27 AM

అలంపూర్ , ఆగస్టు 28 : కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈనెల 31న అలంపూర్లో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ అలంపూర్లో పర్యటించి శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్లో ప్రయాణికుల వేచి ఉండే హాల్స్, టికెట్ కౌంటర్ తదితర సదుపాయాలను పరిశీలించారు.

అనంతరం హరిత హోటల్, తహసీల్దార్ కార్యాలయం, ప్రసాద్ పథకం కింద నిర్మించిన భవనం, అన్నప్రసాద కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అలంపూర్ ఆలయాల సమీపంలో ఏర్పాటు చేస్తున్న సౌండ్స్ అండ్ లైట్స్ ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.