స్వావలంబనకు కార్పొరేట్ పీడ
- స్థానికుల్లో ప్రజాహితుల్లేరా..?
- రాజకీయాల్లో కార్పొరేట్ కల్చర్
- రాజకీయాల్లో పరాయీకరణ...
- గడ్డం వంశం భవిష్యత్‌కు స్థానికత అడ్డం
- స్థానికతపై పెరిగిన డిమాండ్
బెల్లంపల్లి, ఆగస్టు 28 : కార్పొరేట్ రాజకీయాలు (Corporate Politics) స్థానికంగా తిష్ఠ వేశాయి.., ఫలితంగా స్థానికుల్లో రాజకీయ అవకాశాలు అందని ద్రాక్ష అయ్యాయనీ, పారిశ్రామిక రంగంలో నే కాక రాజకీయాల్లో కూడా ప్రైవేటీకరణ రూపం దాల్చిందినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు... వినడానికి కాసింత ఆశ్చర్యం అని పించవచ్చు. కానీ రాజకీయ తాజా పరిస్థితులే వాస్తవమని చెబుతున్నాయి. అందుకు మంచిర్యాల జిల్లా ఎస్సీ నియోజక వర్గాల లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి నిలువుటద్దంగా కనిపిస్తున్నాయి.
బెల్లంపల్లి, చెన్నూ రు నియోజకవర్గాలు పారిశ్రామికంగా చరిత్రాత్మక మైనవి. సింగరేణి బొగ్గు గనులకు బె ల్లంపల్లి, చెన్నూరు విశిష్టమైన చరిత్రకు ప్రతీక. బొగ్గు గనులల్లో కార్మికులు ఉద్యమా ల నిప్పును రాజేసిన చరిత్రకు ఈ ప్రాంతాలు చిరునామ అయ్యాయి.. బెల్లంపల్లి, మందమర్రి పట్టణాలు రాజకీయ సామాజిక విప్ల వం నేపథ్యం గల విభిన్నమైన వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి. కార్పొరేట్ శక్తులు బె ల్లంపల్లి, చెన్నూరు రాజకీయ స్వావలంబనకు గండికొట్టాయని విశ్లేషకులు అంటు న్నారు.
స్థానికంగా ఇదే క్రమంలో ఇక్కడ రాజకీయ ప్రజాహితులు కరవయ్యారా? అ నే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. కా ర్పొరేట్ లీడర్లు అరంగేట్రం చేసి కృత్రిమ రా జకీయ సంక్షోభాన్ని సృష్టించారన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.. ఎన్నికలు స మాజ హితం కోసం కాకుండా అధికార సా ధనాలయ్యాయనీ పరిశీలకులు అంటున్నా రు.. ఇంకా విపులంగా చెప్పుకోవాలంటే ధనసముపార్జనే ధ్యేయంగా పరిణామం చెందా యి.
డబ్బుకోసం రాజకీయం, రాజకీయమే పదవుల కోసం అనే విధానంగా రాజకీయాలు పూర్తిగా అనైతికంగా దిగజారి పో యాయనీ రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గ నియోజక వర్గాల్లో స్థానికతను గోతిలో పెట్టారు. ఈ క్రమం 2023 దశకానికి ముందు ఎన్నికలే రూడీ చేశాయి. బెల్లంపల్లిలో మాజీమంత్రి గడ్డం వినోద్, చెన్నూ రులో గడ్డం వివేక్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్నీ గడ్డం వంశీ కృష్ణ కు దారాదత్తం చేశారు. స్థానికతను రాజకీయ నాయకత్వ లెక్కలోకి తీసుకోలేదన్న విమర్శలు ప్రబలంగా ఉన్నాయి.
ఎన్నికల్లో టికెట్ల ఖరారు ఆర్థిక, అంగబలం ప్రాతిపదికనే జరిగింది. ఇదే క్రమంలో మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చెన్నూర్ లో, బెల్లంపల్లిలో కొందరు ఆశావహులు పార్టీ టికెట్లు కోల్పోయారు. ఈ ప్రాంతాల్లో నూటికి నూరు శా తం పీడిత వర్గాల పిల్లలు రాజకీయాల్లోకి వచ్చారు... కార్మిక, కర్షక, విద్యార్థులు, మొ త్తంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతినిధులు రాజకీయాల్లో ప్రస్తుతం రాణిస్తున్నారు. కానీ కార్పొరేట్ లీడర్లు తమ అంగ బలంతో రిజర్వేషన్ ప్రమాణాలకు గోరికట్టి వేశారు.
స్థానికుల రాజకీయ వికాసానికి వారు అడ్డుతగులుతున్నారనే అభిప్రాయా లు లేకపోలేదు. కాకా కుటుంబం నుంచి ముగ్గురికి టికెట్లు ఇవ్వడం రాజకీయాల్లో ఆధిపత్య సమూహాలకు మాత్రమే పెద్దపీట వేశారనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అం తే కాకుండా కార్పొరేట్ రాజకీయాలకు శ్రీ కారం చుట్టారని స్పష్టం అవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ మరో విష యమేంటంటే.. కార్పొరేట్ లీడర్లు వస్తే బాగా అభివృద్ధి జరుగుతుందనే భ్రమలు పటాపంచలయ్యాయి.
కార్పొరేట్ ప్రతినిధుల వల్ల ఎస్సీ నియోజక వర్గాలు అభివృద్ధి పరంగా తీవ్రంగా నష్టపోయాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అభివృద్ధి మాట అటుంచి తే.. ప్రజలు వారిని కలిసి తమ సమస్యల్ని చె ప్పుకోవడానికి కలిసే అవకాశమే గగనమైపోయిందని స్థానికులు వాపోతున్నారు. కార్పొరేట్ ఎమ్మెల్యేలు ప్రజలతో నేర్పే స త్సంబంధాలిలా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. స్థానికంగానే ఉండరు..? చుట్టపు చూపుగా అపుడప్పుడూ వచ్చివెళ్తుంటారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
- బలం పుంజుకుంటున్న స్థానికత...
స్థానికేతరులు, కార్పోరేట్ కపెనీల అధిపతుల రాజకీయా బండారం బయటపడింది. స్థానికులకు రాజకీయ అవకాశాలు మృగ్యం చేస్తున్న, కార్పొరేట్ లీడర్ల పై బెల్లంపల్లి, చె న్నూర్ నియోజకవర్గాల్లో యుద్ధం మొదలైంది. తమ అస్తిత్వం కోసం ఆరాట పోరా టాలు స్థానికేతర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చెన్నూర్ నియోజకవర్గం లో మొద టి నుంచి స్థానికేతరులే రాజ్యమేలుతున్నా రు. కాకా వెంకటస్వామి, తొలుత ఆయన కు మారులు గడ్డం వినోద్, వివేక్, ఆ తరువాత బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూరులో తిష్ఠ వేశారు.
ఎమ్మెల్యే, ఎంపీ గా పోటీచేసి గెలిచారు. నాన్ లోకల్ లీడర్లు స్థానికులకు రాజకీయ అవకాశాలు దక్కకుండా చేశారని విమర్శలు ఉన్నా యి. కార్పొరేట్ రాజకీయాలు స్థానికతకు ప్రధాన గుదిబండగా అడ్డుపడ్డాయనీ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ నుంచి బరిలోకి దిగిన సుమన్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేసిన గడ్డం వివేక్ చేతి లో ఓటమిపాలయ్యాడు.. ఇద్దరూ స్థానికేతరులే. చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పోటీ చేసే అవకాశం కోల్పోయాడు.
బెల్లంపల్లిలో కూడా ఇదే పరిస్థితీ ఎదురైంది. బెల్లంపల్లి, చెన్నూరు నియోజక వర్గాల్లో ఏలుతున్న గడ్డం బ్రదర్స్ పీకల లోతు విమర్శల్లో కూరుకుపోయారు. స్థానికంగా ఉండటం లేదని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చూగొన్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఇద్దరి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతృప్తితో ఉన్నట్టు ప్రచారం ఉంది. గడ్డం బ్రదర్స్ స్థానికేతరులు కావడం, వారి నియోజక వర్గాల అభివృద్ధినీ నిర్లక్ష్యం చేయడం ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతే కాదు ప్రజలకూ అందుబా టులో లేకపోవడం, వారిపై వినిపిస్తున్న ప్రధాన విమర్శ. కాగా ప్రజలను సంతృప్తి పర్చడంలో ఎమ్మేల్యేలు గా వారు పూర్తిగా విఫలం అయ్యారని చర్చ జోరుగా సాగుతోంది. ఇది బాహాటంగానే వినిపిస్తున్నది. గడ్డం ఫ్యామిలీ ఫవర్ పాలిటిక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే, అభివృద్ధి చేయడం లేదని విమర్శలు వారిపై ప్రబలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానికతనే ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికలు జరిగి మూడేళ్లు.
కాగా స్థానికత డిమాండ్ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఆశవహుల్లోకూడా ఈ ఆకాంక్ష బలంగా వ్యక్తం అవుతున్నది. రోజు రోజుకూ అది మరింత బలపడుతున్నది. అంతే కాదు ఒక ఉద్యమం నినాదరూ పంగా మారే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎక్కడిక్కడా ఇంటా బయటా ఇదే అంశం పై చర్చజరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాం గ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. స్థానికత, స్థానికేతర పేరిట బలమైన విభజన వాదా లు స్పష్టంగా వినిపిస్తున్నా యి.
ఈ నేపథ్యంలో అభివృద్ధి పురోగతి శూన్యం వంటి అంశాలు గడ్డం బ్రదర్స్ రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్ధకానికి తోడయ్యా యని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గడ్డం బ్రదర్స్ ,తనయుడు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ను కాదని, కొత్త వారిని కోరుకునే పరిస్థితి ప్రజల్లో ప్రబలమైన ఆకాంక్ష గా ముందుకొస్తున్నదనీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బెల్లంపల్లి , చెన్నూరు నియోజక వర్గాల్లో రాజకీ యం, దిన దినం రసవత్తరంగా మారుతున్నది..ఈ అసంతృప్తులు ఎక్కడికి దారితీస్తా యో ఎవరి కొంప ముంచుతాయో చూడాలి మరి..






