26 February, 2026 | 8:51 PM

నాగిరెడ్డిపేట్ ఏపీఎంగా వెంకటలక్ష్మి బాధ్యతల స్వీకరణ

26-02-2026 12:26 AM

నాగిరెడ్డిపేట, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): మండల సమాఖ్యలో కొత్త అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం)గా వెంకటలక్ష్మీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వహించి, బదిలీపై నాగిరెడ్డిపేటకు వచ్చారు. ఇంతకాలం ఇక్కడ ఎల్లారెడ్డి ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంకటలక్ష్మీ మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.మండలంలో మహిళా సమాఖ్యల బలోపేతం,ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వ పథకాల అమలువంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు.