పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి: మాజీ ఎంపీ
బోథ్, మే 7 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని వారి అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాల పేద ప్రజలకు అండగా ఉంటున్నారని మాజీ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు కోట కె. గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకున్న లబ్ధిదారుడు బాలాజీ ఆహ్వానం మేరకు వచ్చి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం గ్రామంలో 15 మంది పేదలకు ఇండ్లు మంజూరు ఇవ్వడం జరిగింది అన్నారు. గ్రామంలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామంలో త్రాగునీటి ఇబ్బంది ఉందని గ్రామస్తులు మాజీ ఎంపీ కి విన్నవించారు.తాను గతంలో నాలుగు , బోర్ బావులు మంజూరి ఇవ్వడం జరిగిందని అయితే కాలనీవాసుల కోరిక మేరకు మరో బోర్వెల్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఫేస్ వే పూజ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల పోతన్న పవన్ గాడ్గే పరశురాం చంద్రకాంత్ గజానంద్ తోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు






