28 June, 2026 | 3:45 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే భూ సేకరణ

07-05-2026 03:58 PM

సదాశివనగర్,మే07(విజయక్రాంతి): భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రోడ్డు సర్వే చేయాలనీ గ్రామ సభలో తీర్మానం చేశారు.కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ టేక్రియాల లావణ్య రమేష్, ఉపసర్పంచ్ ఎడ్ల గంగారం అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.టీజీ ఐ ఐ సి లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు టీ జీ ఐ ఐ సి కంపెనీ అప్రోచ్ రోడ్ భూ సేకరణ సర్వే నిలిపివేయాలని తీర్మానం చేసినట్టు సర్పంచ్ టేక్రియాల లావణ్య రమేష్ ఉపసర్పంచ్ ఎడ్ల గంగారం తెలిపారు.కార్యక్రమంలో మండల తహసిల్దార్ సత్యనారాయణ ,గిర్ధావార్ సంతోష్ ,సర్వేయర్, జిపిఓ మరియు పాలకవర్గ సభ్యులు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.