భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందండి
జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి ఎం శశి కుమార్...
బాన్సువాడ, మే 7 (విజయ క్రాంతి): భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరు సంక్షేమ ఫలాలు పొందాలని జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి ఎం శశి కుమార్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో ని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద గురువారం కార్మిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు భవన నిర్మాణ కార్మికుల సమావేశాలను నిర్వహిస్తూ వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలను అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సహాయ అధికారి ఎం శశి కుమార్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కార్మిక శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేరుస్తూ వారికి అనేక ప్రభుత్వ పథకాలను అందించడం ఆయన తెలిపారు.
లేబర్ కార్డు ఉన్న వ్యక్తి సహజ మరణం చెందుతే 2025 వ సంవత్సరం జులై నెల 24వ తేదీ నుంచి సహజ మరణం చెందిన కార్మికులకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రమాదవశాత్తు మరణానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఆర్థిక సహాయంతో పాటు భవన నిర్మాణ బోర్డులో సభ్యులుగా చేరిన కార్మికుల పిల్లకు పదవ తరగతి పాస్ అయిన వారి కి నాక్ మరియు ఏటీసీ ద్వారా వృత్తిలో నైపుణ్యం కల్పిస్తూ వారికి విదేశాలకు ఉపాధి కోసం పంపిస్తూ కార్మిక శాఖ బాధ్యతగా లక్షల రూపాయల వేతనాల్ని కూడా ఇప్పించడం జరుగుతుందని. ఆయన అన్నారు.
భవన నిర్మాణ కార్మికుల కుటుంబ సభ్యులు కాన్పులకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని మొదటికూతురు పెళ్లికి రెండు కాన్పులకు మరియు రెండవ కూతురు పెళ్లికి రెండు కాన్పులకు 30 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది అని ఆయన తెలిపారు భవన నిర్మాణ కార్మికులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ రాములు, కార్మిక శాఖ అధికారి ఇబ్రహీం జుబేర్,కార్మిక శాఖ జూనియర్ అసిస్టెంట్లు సతీష్ రెడ్డి, దావుద్, తాపీ మేస్త్రి సంఘం నాయకులు గడ్డి వెంకటేశ్వర్లు, తోట శ్రీనివాస్, సర్దార్, ఏఐటీయూసీ నాయకులు శంకర్, కమ్మరి రాములు, నల్ల గంగాధర్, నీలి శంకర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు






