కేరళం సీఎంగా వీడీ సతీషన్
తిరువనంతపురం: కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్(VD Satheesan as Kerala CM) పేరు ఖరారు అయింది. దీతో కేరళ సీఎం ఎంపికపై సస్పెన్స్ వీడింది. వీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం గురువారం ప్రకటించింది. 11 రోజుల మథనం తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ సీఎం పేరును ప్రకటించింది. సతీశన్ స్వస్థలం ఎర్నాకులం జిల్లా నెట్టూరు. రాజకీయాల్లోకి రాకముందు సతీశన్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.
2001లో పరాపూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001 నుంచి వరసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2021-2026 మధ్య విపక్షనేతగా పనిచేశారు. KPCC వైస్ ప్రెసిడెంట్, AICC సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. PAC, అంచనా కమిటీ చైర్మన్ గా సతీశన్ పనిచేశారు. కేరళ ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ పేరును ప్రకటించగానే ఆయన నివాసం వెలుపల ఆయన మద్దతు దారులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.






