కేరళం సీఎంగా వీడీ సతీశన్— కేసీ వేణుగోపాల్ రియాక్షన్
హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
కేరళ సీఎం ఎంపికపై కేసీ వేణుగోపాల్
తిరువనంతపురం: కేరళం సీఎంగా సతీశన్ ఎంపికపై కేసీ వేణుగోపాల్ స్పందించారు. సతీశన్ ఎంపికపై ఎలాంటి అసంతృప్తి లేదని వేణుగోపాల్ వెల్లడించారు. తాను పూర్తిగా సంతృత్తిగా ఉన్నానని మీడియాతో అన్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని కేసీ తెలిపారు. కాంగ్రెస్ లో హైకండా నిర్ణయమే శిరోధార్యమని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. అన్ని రకాలుగా ఆలోచించి అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి. వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ... "తుది నిర్ణయం వెలువడింది. కేరళ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వి.డి. సతీశన్‌ను కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఈ పదవి లభించినందుకు వి.డి. సతీశన్‌కు నా అభినందనలు. కేరళ ప్రజలు UDFకు ఒక గొప్ప తీర్పును ఇచ్చారని నేను భావిస్తున్నాను. వి.డి. సతీశన్ నేతృత్వంలోని ప్రభుత్వం, నాయకత్వం కేరళ ప్రజల ఆకాంక్షలను, వాగ్దానాలను నెరవేర్చగలవు. నిస్సందేహంగా, కేరళ ప్రభుత్వానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది." అని పేర్కొన్నారు.
అటు సీఎంగా సతీశన్ ఎంపిక పట్ల రమేశ్ చెన్నితాల వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. తిరువనంతపురంలోని చెన్నితాల నివాసం వద్ద ఆయన అనుచరులు నిరసన చేపట్టారు. కేరళ సీఎంగా వీ.డీ. సతీశన్‌ను కాంగ్రెస్ అధిష్టానం గురువారం అధికారికంగా ప్రకటించింది. దీంతో కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. సీనియర్ నాయకులు, అధిష్టాన ప్రతినిధులతో సుదీర్ఘ చర్చల అనంతరం, ఈ కీలక పదవికి సతీశన్ ఎంపికయ్యారు. సతీశన్ నియామకం కేరళ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.






