పెద్దమల్లారెడ్డిలో వన మహోత్సవం
25-08-2026 04:15 PM
బిక్కనూర్, ఆగస్టు 25 (విజయ క్రాంతి): తెలంగాణ వన మహోత్సవంలో భాగంగా పెద్దమల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సహకార అధికారి రామ్మోహన్, సంఘ అధ్యక్షుడు బాలగౌని రాజాగౌడ్, మానిటరింగ్ అధికారులు సురేష్, నర్సింలు, సంఘ కార్యదర్శి మోహన్‌గౌడ్, సిబ్బంది, రైతులు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలను సంరక్షించాలని వారు సూచించారు.






