25 August, 2026 | 6:00 PM

Breaking News

ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు!   •   శ్రమిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు: నీలం మధు ముదిరాజ్   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఐపీఎస్‌ విద్యార్థి అక్షిత్   •   బీటీపీఎస్ కళాకారున్ని సన్మానించిన బిచ్చన్న సీఈ   •   అన్ని గ్రామాల్లో వనమహోత్సవం   •   ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలి   •   మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   నిజామాబాద్ నషా ముక్త్ భారత్ కోసం యువత కృషి చేయాలి   •   జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను కలిసిన యాదవ ఉత్సవ కమిటీ   •  

అస్తవ్యస్తంగా మున్సిపాలిటీ రోడ్లు

25-08-2026 04:54 PM

- మంత్రి ఇలాకాలో దుస్థితి

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. నియోజక వర్గ కేంద్రంలోనే రోడ్లు ఇలా ఉంటే మారుమూల మండలాల్లోని గ్రామాల్లో దుస్థితి ఇంకెంత దారుణంగా తయారయ్యాయోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి, చెన్నూర్ ఎంఎల్ఏ గడ్డం వివేక్ వెంకట స్వామి క్యాంపు కార్యాలయంలో బస చేసిన సమయంలో ఉదయం మార్నింగ్ వాక్ లో రోడ్లను, డ్రైనేజీలను పరిశీలించే సమయంలో ఇవి కనిపించడం లేదా అని 18వ వార్డు ప్రజలు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. చిరుజల్లులకే కంపుగా మారుతున్నాయని, దోమలు వృద్ది చెంది రోగాల బారిన ప్రజలు పడకముందే మంత్రి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లు, అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.