25 August, 2026 | 6:14 PM

కంటి దానం మరొకరి జీవితంలో వెలుగులు

25-08-2026 05:02 PM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్

కామారెడ్డి,(విజయక్రాంతి): కంటి దానం మరొకరి జీవితంలో వెలుగులు నింపుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ అన్నారు. మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీ నిర్వహించారు. కంటి దాన పక్షోత్సవాలు సందర్భంగా కామారెడ్డిలో వైద్యులు, ఎన్జీవోలు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కంటి దానం అనేది ఒక వ్యక్తి మరణానంతరం కూడా మరొ ఇద్దరి  జీవితంలో వెలుగును నింపే గొప్ప మానవతా సేవ అని అన్నారు.

ప్రజలు కంటి దానంపై ఉన్న అపోహలను తొలగించుకొని, కంటి దానం గురించి కుటుంబ సభ్యులతో ముందుగానే చర్చించుకోవాలని సూచించారు. కంటి దానం చేయాలనే సంకల్పం కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఎంతో ముఖ్యమని, మరణం సంభవించినప్పుడు వెంటనే సంబంధిత కంటి బ్యాంకు కు సమాచారం అందించాలన్నారు.కంటి దానం అనేది శాస్త్రీయంగా, వైద్యపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించే ప్రక్రియ అని పేర్కొన్నారు.