25 August, 2026 | 6:03 PM

బిజెపిరాష్ట్ర అధ్యక్షుడి ధర్నాకు కామారెడ్డి బిజెపి నాయకులు మద్దతు

25-08-2026 05:12 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష  కార్యక్రమానీకి మద్దతుగా మంగళవారం కామారెడ్డి బిజెపి నాయకులు, కౌన్సిలర్లు తరలి వెళ్లారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు పలికేందుకు వెళ్లారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఫీజు రీయింబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ప్రభుత్వ తీరును నిరసిస్తూ 48 గంటల పాటు చేపట్టిన నిరసన కార్యక్రమం తోనైనా దిగి రావాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు రాజధానికి తరలి  వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మోటూరి శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.