25 August, 2026 | 6:04 PM

గూడెం పాఠశాలలో వన మహోత్సవం

25-08-2026 05:10 PM

బెజ్జంకి: బెజ్జంకి మండల పరిధిలోని గూడెం గ్రామంలో మంగళవారం వన మహోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనం పెంపొందించాలనే లక్ష్యంతో పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటిన మొక్కలను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు.

“మొక్కలు నాటడం మన బాధ్యత.. వాటిని సంరక్షించడం మన భవిష్యత్ తరాలకు ఇచ్చే గొప్ప బహుమతి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరశురాములు, వార్డు సభ్యులు నూనె రాములు, శ్రీనాథ్ రెడ్డి, బోనాల రమేష్, బోనాల లక్ష్మి, పాఠశాల హెచ్‌ఎం రేవతి, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్ సరోజనతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.