25 August, 2026 | 6:00 PM

Breaking News

ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు!   •   శ్రమిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు: నీలం మధు ముదిరాజ్   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఐపీఎస్‌ విద్యార్థి అక్షిత్   •   బీటీపీఎస్ కళాకారున్ని సన్మానించిన బిచ్చన్న సీఈ   •   అన్ని గ్రామాల్లో వనమహోత్సవం   •   ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలి   •   మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   నిజామాబాద్ నషా ముక్త్ భారత్ కోసం యువత కృషి చేయాలి   •   జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను కలిసిన యాదవ ఉత్సవ కమిటీ   •  

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఛలో కలెక్టరేట్

25-08-2026 04:22 PM

ఎర్రుపాలెం ఆగస్టు 25 (విజయ క్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్ కు ఎర్రుపాలెం మండల కార్మికులు వెళ్తున్న సందర్భంగా  సీఐటీయూ జిల్లా నాయకులు మద్దాల ప్రభాకర్  మాట్లాడుతూ.. పాలకులు మారినా కార్మికుల సమస్యలు పరిష్కారం అవేదన వ్యాక్తం చేశారు.రాష్ట్రం లో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండు నర ఏండ్లు అయినప్పటికీ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ చేయలేదని మండిపడ్డారు.

సమస్యల పరిష్కారానికి  అనేక సార్లు విన్నవించినా ప్రస్తుతం మండల,జిల్లా కేంద్రాలలో నిరసన దీక్షలు జరుగుతున్నా ప్రభుత్వం eస్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.ఇప్పటికై రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ, వివిధ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్మికుల అధ్యక్షా కార్యదర్శులు గoతల నాగేశ్వరావు, కలపాల రవీంద్రా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.