26 August, 2026 | 1:24 AM

మహా ప్రస్థానం దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి

25-08-2026 04:51 PM

- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్ లో మహా ప్రస్థానం దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని కోరుతూ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంగళ వారం రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవిని కలిసి వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల మహా ప్రస్థానం కేంద్ర, మున్సిపల్ నిధులతో నిర్మాణం చేపట్టినప్పటికీ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ మంచిర్యాల ఎమ్మెల్యే మహా ప్రస్థానం పేరిట ఒక్క సొసైటీ ఏర్పాటు చేసి వివిధ సంఘాలు, దాతల నుంచి విరాళాలు సేకరించి మహా ప్రస్థానం నడపడం, మహా ప్రస్థానం ప్రభుత్వానిది అయినప్పటికీ దానిలో అధికార పార్టీకి చెందిన వారిని ఉద్యోగులుగా నియమించి వారికి అందిస్తున్న వేతనాలపై తగిన విచారణ జరిపించాలని కోరారు.