రాజ్యాధికార పార్టీ మైనార్టీ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా మహమ్మద్ అమ్జాద్ పాషా నియామకం
జనగామ,(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు, పార్టీకి నిస్వార్థంగా సేవలందిస్తూ, మైనార్టీల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీనియర్ నాయకులు మహమ్మద్ అమ్జాద్ పాషా ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనార్టీ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అమ్జాద్ పాషా మాట్లాడుతూ... నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ సోదరుల సమస్యలను ప్రభుత్వం, పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శక్తివంచన లేకుండా పని చేస్తాను" అని తెలిపారు.






