విద్యాసంస్థలు, దేవాలయాల సమీపంలోని బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలి
జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేత
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎస్టీ బాలికల కళాశాల వసతిగృహం, ఆశ్రమ పాఠశాల, సాయిబాబ ఆలయం, శివాలయం, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నడుస్తున్న బెల్టు షాపులను వెంటనే తొలగించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ విద్యాసంస్థలు, దేవాలయాల వద్ద సుమారు పది బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు, మహిళలు, దేవాలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలిగించే విధంగా మద్యం విక్రయాలు జరపడం సరికాదని అన్నారు. వెంటనే జిల్లా ఎస్పీ, సంబంధిత అధికారులు స్పందించి సదరు బెల్టు షాపులను తొలగించి, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ననాయకులు పాల్గొన్నారు.






