25 August, 2026 | 6:05 PM

నూతన సూపరింటెండెంట్ గా డాక్టర్ జోయెల్ డోనాల్డ్

25-08-2026 04:57 PM

మెరుగైన వైద్య సేవలపై ప్రజల్లో ఆశలు

నాగల్ గిద్ద: కరస్ గుత్తి సామాజిక ఆసుపత్రి  నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ జోయెల్ డోనాల్డ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో మీర్జాపూర్‌లో వైద్యుడిగా సేవలందించిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ శ్రీధర్ పదోన్నతిపై సంగారెడ్డి జిల్లా డీసీహెచ్ఎస్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో జోఏల్ డోనాల్డ్‌ను నియమించారు. నూతన సూపరింటెండెంట్‌కు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, అందుబాటులో ఉన్న సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని డాక్టర్ జోఏల్ డోనాల్డ్ తెలిపారు.