మంత్రి హోదాలో వీహెచ్.. రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా వి. హనుమంతరావు నియామకం
- బీసీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారుడిగా వీహెచ్
- మంత్రి హోదాలో వీహెచ్ ను సలహదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్: ఎన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి. హనుమంతరావు (VHR)ను రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government), రాష్ట్ర మంత్రి హోదాలో బీసీ సంక్షేమం, అభివృద్ధి సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హనుమంతరావు(V. Hanumantha Rao), తెలంగాణకు చెందిన భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.
ఆయన రాజకీయ ప్రస్థానం 50 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉంది. 2004 నుండి 2016 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ, శాసనసభ్యుడిగానూ పనిచేసిన వీహెచ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలు రెంటిలోనూ ఒక అగ్రశ్రేణి నాయకుడిగా సేవలందించారు. యూత్ కాంగ్రెస్‌లో(Youth Congress) ఆయన చేసిన కృషికి, అలాగే గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.
Government of Telangana appoints V. Hanumantha Rao as Advisor (BC Welfare & Development) with Rank equivalent to Minister of State.







