30 April, 2026 | 3:03 PM

చిన్నారుల అక్రమ రవాణా: హైదరాబాద్‌లో మురుగన్ గ్యాంగ్‌ అరెస్ట్

30-04-2026 12:34 PM

హైదరాబాద్: చిన్న పిల్లల కిడ్నాప్ గ్యాంగ్(Kidnap Gang) గుట్టు రట్టు అయింది. హైదరాబాద్ లో మరోసారి గుజరాత్ పోలీసులు(Gujarat Police) తనిఖీలు నిర్వహించారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో మురుగన్ గ్యాంగ్ అరెస్ట్ అయింది. గుజరాత్ పోలీసులు మురుగన్ గ్యాంగ్(Murugan Gang)ను అరెస్ట్ చేశారు. మురుగన్ ఆదిలాబాద్ లో గతేడాది వరకు ఇటుకల బట్టిలో పనిచేశాడు. ఒక్క ఏడాదిలోనే చైల్డ్ ట్రాఫికింగ్ లో మురుగన్ కీలకంగా మారాడు. గతేడాది చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో మురుగన్ పేరు వెలుగులోకి వచ్చింది.

గతేడాది 3 నెలల పాటు జైలులో ఉన్న మురుగన్ జులైలో విడుదలైయ్యాడు. మురుగన్ దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్(Child Trafficking) ముఠా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. మురుగన్ భార్య కృష్ణవేణి మరో గ్యాంగ్ ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మురుగన్ గ్యాంగ్ 25 మంది చిన్నారుల విక్రయాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మురుగన్ కు హైదరాబాద్ లో మూడు ఫెర్టిలిటీ సెంటర్లకు(Fertility Centers) సంబంధాలు ఉన్నట్లు విచారణలో తెలింది. గుజరాత్ పోలీసులు ఫెర్టిలిటీ  సెంటర్ల సంబంధాలపై విచారణకు హైదరాబాద్ కు వచ్చారు. కూకట్ పల్లి, సికింద్రాబాద్, బంజారాహిల్స్ లో గుజరాత్ పోలీసులు సోదాలు చేశారు.