23 April, 2026 | 6:20 AM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవాలి

23-04-2026 12:29 AM

ఏఎంసి చైర్మన్ పులి కృష్ణ  

బెజ్జంకి ఏప్రిల్ 22: రైతులు తమ పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకునేలా  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని మార్కెట్ చైర్మన్ పులి కృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని వీరపూర్ దేవక్కపల్లి, తోటపల్లి, గాగిల్లాపూర్ గ్రామాల్లో బుధవారం   వడ్ల కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ స్థానిక సర్పంచుల తో కలిసి ప్రారంభించారు. రైతులు తమ పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకునేలా  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

డబ్బులు  రైతులకు సమయానికి చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామనీ. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని వీరాపూర్ సర్పంచ్ సతీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశ్వినీ శ్రీనివాస్, జానకి రాజు లు, మార్కెట్ కమిటీ సభ్యులు,రైతులు చెన్నారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.