అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
23-04-2026 12:28 AM
సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ వెంకటయ్య
లింగాల, ఏప్రిల్ 22: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే అంగన్వాడీల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ వెంకటయ్య అన్నారు. బుధవారం లింగాలలో పోషణ పక్షంలో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు.
చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. సిడిపివో దమయంతి మాట్లాడుతూ మాతా శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే పోషణ పక్షం లక్ష్యమని.. కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని అన్నారు. వార్డు సభ్యులు రాజు, మండల మహి ళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా, ఐసిడియస్ సూపర్వైజర్ గిరిజ తదితరులు పాల్గొన్నారు.






