22 August, 2026 | 8:19 PM

Breaking News

ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   న్యాయ అవగాహనతో హక్కులపై విద్యార్థులకు అవగాహన   •   సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •   ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం   •   ఎంపీడీవోకు వార్డు సభ్యుల ఫోరం సన్మానం   •   శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫెయిర్   •   పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి   •   ప్రమాదకర గుంతను పూడ్చివేయించిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎక్స్‌ప్లోరికా   •   ఔదార్యాన్ని చాటిన ఆదివాసీ నాయకుడు పెండకట్ల యాకయ్య   •  

ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత

23-04-2026 12:30 AM

బస్సులు నడిపేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న కార్మికులు

కల్వకుర్తి ఏప్రిల్ 22 : కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. సాయంత్రం సమయంలో కార్మికులు ధర్నా కొనసాగిస్తుండగా, పోలీసులు రక్షణ మధ్య మూడు బస్సులను డిపో నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారు. అయితే, మరో బస్సు బయటకు వస్తుండగా సమ్మె చేస్తున్న కార్మికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ క్రమంలో కొంత మంది ఆగ్రహంతో బస్సుల అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు డ్రైవ్ప కారం పొడి చల్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.సమస్య పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు అక్కడ మోహరించారు. ఉద్రిక్తత పెరగడంతో బయటకు పంపిన బస్సులను తిరిగి డిపోకు తరలించారు.