రేణుకది హత్యా? ఆత్మహత్యా?
లంగర్‌హౌస్‌లోని హోటల్‌లో ఉరేసుకొన్న అల్వాల్ యువతి
ఫరూక్‌తో వివాహేతర సంబంధం
కూకట్‌పల్లిలోని పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా వృత్తి
రేణుకను హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
హైదరాబాద్/ సికింద్రాబాద్, జూలై 3 (విజయక్రాంతి): అల్వాల్‌కు చెందిన బార్ డ్యాన్సర్ రేణుక (26) లంగర్ హౌస్‌లోని ఓ లాడ్జిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. వివాహేతర సంబంధమే ఆమె ప్రాణాలను బలితీసుకుందా? రేణుక, ఫరూక్ ఇద్దరూ కలిసి గురువారం రాత్రి హోటల్‌లో గదిని బుక్ చేసుకున్నాక ఏం జరిగింది? బర్త్‌డే గిఫ్ట్ ఇదేనంటూ తన స్నేహితురాలికి వీడియో కాల్ ఎందు కు చేసింది? అయితే తన బిడ్డది ఆత్మహత్య కాదని, హత్యచేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు, స్థానికులు, తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. రేణుక కూకట్‌పల్లిలోని పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. ఆమె కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. అమెకు ఏడేళ్ల కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె గోల్కొండ నివాసి, వివాహితుడు, ముగ్గురు పిల్లల తండ్రి అయిన ఫరూక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ కొంతకాలంగా ఓ హోటల్‌కు తరచూ వెళ్తున్నారు. గురువారం ఉదయం కూడా ఇద్దరూ హోటల్‌లో గదిని(రూమ్ నం 1611) బుక్ చేసుకుని వెళ్లారు.
రాత్రి ఫరూక్(34) బయటకు వెళ్లి వచ్చే సరికే రేణుక ఆత్మహత్య చేసుకుందని అతను చెబుతున్నాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్యకు ముందు ఆమె ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడినట్లు, తర్వాత రేణుక తన స్నేహితురాలికి వీడియో కాల్ చేసినట్లు తెలుస్తుంది. తన మరణమే బర్త్ డే గిఫ్ట్ అని ఆమెకు చెప్పిన్నట్లు ఉంది.
ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ఐతే రేణుక కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. గోల్కొండ పోలీసులు ఫరూక్‌ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆమెది ఆత్మహత్యా లేక ప్రేరేపిత ఆత్మహత్యా లేక హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారా? లేక ఇంకేమైన కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






