ఉర్దూ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలి
13-04-2026 08:00 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో మైనార్టీ వార్డుల్లో ఉన్న పిల్లల కోసం ఉర్దూ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంఐఎం పార్టీ సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు ప్రభుత్వం ఉర్దూ ప్రాంతాల్లో ఉర్దూ అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల పిల్లలు నష్టపోతున్నారని తెలిపారు. ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు ముజాహిద్ ఖాన్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు మజార్ మహమ్మద్ సాహిబ్ మజీద్ అక్బర్ తదితరులు ఉన్నారు




