3 May, 2026 | 4:04 AM

భద్రాద్రి జిల్లాలో అకాల వర్షం

03-05-2026 12:00 AM

నేలపాలైన వరి, మొక్కజొన్న 

భద్రాద్రి కొత్తగూడెం/అశ్వాపురం, మే 2 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం అకాల వర్షం కురిసింది. మణుగూరు, భద్రాచలం, గుండాల మండలాల్లో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న మొక్క జొన్న, వరి తడిసిపోయింది.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యా న్ని, మొక్కజొన్నను ఎప్పటికప్పుడు తరలించకుండా నిల్వ ఉంచడం వల్ల అకాల వర్షా నికి తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అశ్వాపురం మండలం మొండికుంట వడ్ల కళ్లంలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసింది. కాంటా పెట్టిన బస్తాలు తడవడంతో నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది.