చదువే అభివృద్ధికి మూలం
ములకలపల్లి,(విజయక్రాంతి): మనిషిని మహోన్నత శక్తిగా మార్చే ఆయుధం చదువు మాత్రమేనని పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం డా. కృష్ణ చైతన్య స్వామి భద్రాచలం కేంద్రం గా శ్రీనృసింహ సేవా వాహిని అనే సంస్థ సహకారంతో విద్యార్థులకు బ్యాగ్ లు,నోట్ పుస్తకాలు ములకలపల్లి పోలీస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.మండలంలోని చింతలపాడు ప్రైమరీ స్కూల్, ఎంపీపీఎస్ మామిళ్ళగూడెం పాఠశాలల్లో వందమంది విద్యార్థిని, విద్యార్థులకు విద్యా వికాసం కిట్లు అందజేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ... మారుమూల పల్లెల్లో విద్యావ్యాప్తికి సహకారం అందించడం నిజంగా ఎంతో అభినందనీయమని మనిషిని మహోన్నతశక్తి గా మార్చే ఆయుధం చదువు మాత్రమేనని చెప్పారు.గిరిజన పల్లెల్లో కృష్ణ చైతన్య స్వామి వారు చేస్తున్న సేవలు మరువలేనివని అన్నారు.ప్రతిఇంట్లో ఒక ఉద్యోగి ఉండాలని, పేదరికం పోయి ప్రతిఒక్కరూ మరొకరికి చేయూతనిచ్చే శక్తులుగా ఎదగాలనే సంకల్పం నిజంగా ఎంతో గొప్పదని అన్నారు.






