లారీల కొరత లేకుండా చర్యలు
- బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ హైమావతి
- రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వాహకులకు ఆదేశం
కోహెడ, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మండలంలోని బస్వాపూర్ ఐకెపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. గత ఏప్రిల్ 28న నత్తనడకన ధాన్యం కొనుగోలు, మే 1న గ్రేడ్ బీ ద్వారా వరిధాన్యం కొనుగోళ్లు అనే వరుస శీర్షికన ‘విజయక్రాంతి’లో ప్రచురణకు స్పందన లభించింది. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ధాన్యం తరలించేందుకు లారీ ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ధాన్యం గ్రేడ్ కేటాయింపుపై అగ్రికల్చర్ అధికా రులతో మాట్లాడనున్నట్లు చెప్పారు. సెంటర్‌లో తాగునీటి వసతి, చలువపందిర్లు, తాలుతీసే యంత్రాలు, గన్నిబ్యా గులపై ఆరా తీశారు. రైతులు రాత్రి వేళలో ధాన్యంపై టార్ఫాలిన్ కవర్లు కప్పి ఉంచాలని అకాల వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు.






