11 July, 2026 | 1:25 AM

నేడు పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం

11-07-2026 12:15 AM

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు దర్శనాల నిలుపుదల                                

యాదగిరిగుట్ట దేవస్థాన ఈవో భవాని శంకర్  

యాదగిరిగుట్ట, జూలై 10 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రభుత్వం నియమించిన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఉదయం 11.37 గంటలకు నిర్వహించనున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన సమయాలను మార్పు చేసినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు.

సుదర్శన నరసింహ హోమం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, బ్రేక్ దర్శనం 9 నుంచి 9.30గంటల వరకు,నిత్య కల్యాణం ఉదయం10.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు తాత్కాలికంగా మార్పులు చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి ప్రైవేటు వాహనాలను అనుమతించడం లేదని తెలిపారు. నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.