22 April, 2026 | 4:16 PM

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి

22-04-2026 02:56 PM

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూశారు. చిట్టిబాబు మృతిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజం పట్ల నిబద్ధతతో, నిరంతరం ప్రజా సమస్యలపై గళమెత్తే వారి మరణం సమాజానికి తీరని లోటు అని, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, విశ్లేషకుడిగా సినీరంగానికి విశేష సేవలందించారని కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా చిరస్థాయిలో నిలిచిపోతారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని  భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కొండాపూర్ లోని సింధు హాస్పిటల్లో బుధవారం గుండెపోటుతో చిట్టిబాబు తుది శ్వాస విడిచారు. చిట్టిబాబు మృతిపట్ల పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.