22 April, 2026 | 3:39 AM

థ్రిల్లింగ్ అంశాలతో పరమపద సోపానం

22-04-2026 02:14 AM

అర్జున్ అంబటి హీరోగా రూపొందిన చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు. స్వయంభూ క్రియేషన్స్ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రానికి తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటించారు.

ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీరశంకర్, సముద్ర ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ.. “పరమపద సోపానం’తో మేం మంచి ప్రయత్నం చేశాం. థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చుతుంది” అన్నారు. ‘పరమపద సోపానం చాలా కొత్తగా ఉంటుంది. నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది.

ఇలాంటి ఓ సినిమాలో నటించడం ఆనందంగా ఉంద’ని  హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ చెప్పారు. ‘ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా ఈ చిత్రాన్ని అందరూ చూసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాన’ని దర్శకుడు నాగశివ తెలిపారు. నిర్మాత గణపర్తి నారాయణరావు మాట్లాడుతూ.. “శివ మా అబ్బాయి. సినిమానే జీవితంగా మార్చుకున్నాడు. మా మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులతోపాటు చిత్ర నిర్మాత తేలప్రోలు ప్రసన్నాంజనేయులు, సంగీత దర్శకుడు దేవ్ జాండ్, డీవోపీ ఈశ్వర్, గీత రచయిత రాంబాబు గోసాల కూడా మాట్లాడారు.