కామారెడ్డి రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని యువతి మృతి
కామారెడ్డి, మే 19 (విజయక్రాంతి): కామారెడ్డి రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ఓ గుర్తు తెలియని యువతి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకున్నట్లు రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. 30 సంవత్సరాల వయసుగల యువతి రైల్వేస్టేషన్ ఆవరణలో వేసిన బల్లపై పడుకుని నిద్రలోనే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. యువతి వద్ద ఎలాంటి వివరాలు లేవని ఎక్కడినుండి వచ్చిందో తెలియదని తెలిపారు. యువతికి సంబంధించిన ఎవరైనా వచ్చి గుర్తుపట్టి శవాన్ని తీసుకెళ్లాలని ఎస్సై తెలిపారు.
మృతి చెందిన యువతి పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు తెలిపారు. అనారోగ్య కారణాలవల్ల మృతి చెందినట్లు భావిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఫుల్ బ్లూ కలర్ టాప్, బ్లూ అండ్ వైట్ చేక్స్ ఉన్న దుస్తులు ఉన్నట్లు తెలిపారు. టాప్ పై బ్లూ కలర్ షర్ట్, రెడ్ కలర్ చున్నీ ఉన్నట్లు తెలిపారు. బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. యువతి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు, ఐడి కార్డు లేదన్నారు. ఉపదేయాన్ని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. సంబంధికులు ఎవరైనా ఉంటే వచ్చి శవాన్ని తీసుకెళ్లాలని కోరారు. కామారెడ్డి రైల్వే పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నది రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు.






