ఈదురు గాలులతో కూడిన వర్షం.. జొన్న రైతుకు కష్టం
పంట అమ్మకానికి వచ్చిన జొన్న రైతుకు కష్టం.
బోథ్,(విజయక్రాంతి): బజార్హత్నూర్ సోనాల మండలాలలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల జొన్న పంటను మార్కెట్కు తీసుకువచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పంటను పండించడం ఒక ఎత్తైతే అమ్ముకోవడం మరో ఎత్తు అయిందని రైతులు వాపోతున్నారు. ఈదురుగాలి తీవ్రత వల్ల జొన్న కుప్పలపై కప్పిన టార్పాలిన్ కవర్లు ఎగిరిపోవడంతో జొన్న పంట తడిసిపోయిందని రైతులు వా పోతున్నారు.తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అకాల వర్షాలు రైతాంగానికి శాపంగా మారుతున్నాయి.... ముగియనున్న మొక్కజొన్న కొనుగోళ్ల సమయం... మొక్కజొన్న కొనుగోలు ఈనెల 20 వరకు చివరి తేదీ అని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన మొదలైంది. మార్కెట్ లో అమ్మేందుకు తెచ్చిన మొక్కజొన్న తూకం ఇంకా పూర్తిగా కాకపోగా, అనేకమంది రైతుల పొలాల్లో మొక్కజొన్న పంట ఉండిపోయింది. ఒకవైపు కూలీలు హార్వెస్టర్ ల కొరత వల్ల పంట ఇంటికి చేరక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ మాత్రం జొన్న పంట కొనుగోళ్ల కటప్ డేట్ 20 గా నిర్ణయించడంతో పంట చేతికి వచ్చిన ఇంటికి చేరని రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. అధికారులు మరింత గడువు పెంచాలని కోరుతున్నారు.






