11 March, 2026 | 4:39 AM

మెడికవర్‌లో పెద్దప్రేగు క్యాన్సర్‌పై అవగాహన

11-03-2026 12:02 AM

క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమం

హైదరాబాద్, మార్చి ౧౦(విజయక్రాంతి): పెద్దప్రేగు క్యాన్సర్ అవగాహన నెల (మార్చి) సందర్భంగా హైటెక్ సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ పెద్దప్రేగు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, నివారణపై అవగాహన పెంచడం లక్ష్యంగా ప్రత్యేక కొలొరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో పెద్దప్రేగు క్యాన్సర్ ఒకటి.

పరిశోధనల ప్రకారం సగటున ప్రతి 20 మందిలో ఒకరికి పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముందస్తు స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం సాధ్యమ వుతుంది. దీంతో చికిత్స ఫలితాలు గణనీయం గా మెరుగుపడతాయి. సాధారణంగా రూ.11, 510 విలువైన ఈ ప్యాకేజీని ప్రస్తుతం కేవలం రూ.5,755కే (50శాతం రాయితీతో) అందుబాటులో ఉంచింది.

ఈ స్క్రీనింగ్ ప్యాకేజీలో ఉండే పరీక్షలు: కొలోనోస్కోపీ,  ఫీకల్ ఆకల్ట్ బ్లడ్ టెస్ట్ (ఎఫ్‌ఓబీటీ), సీరం సీఈఏ (కార్సినోఎంబ్రియోనిక్ యాంటిజెన్),కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), అల్ట్రాసౌండ్ అబ్డమెన్ అండ్ పెల్విస్, ఆంకాలజిస్టు కన్సల్టేషన్ వైద్య నిపుణుల సూచనల ప్రకారం 50 సంవత్సరాల పైబడిన వారు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్న వారు లేదా మలంలో రక్తం కనిపించ డం, అర్థం కాని బరువు తగ్గడం, తరచూ మలబద్ధకం, తీవ్రమైన కడుపు నొప్పి, రక్తహీనత (అనీమియా), రక్తస్రావం వంటి లక్షణాలు ఉన్న వారు ఈ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిదని తెలిపారు. మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ఆధునిక క్యాన్సర్ చికిత్స సాంకే తికతతో పాటు వివిధ విభాగాల నిపుణుల బృందం ఒకే చోట సమగ్ర క్యాన్సర్ చికిత్స సేవలను అందిస్తోంది. 

స్క్రీనింగ్ కోసం అపాయింట్మెంట్ పొందడానికి 040-68334455 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఈప్రత్యేక ఆఫర్ 31 మార్చి 2026 వరకు అందుబాటులో ఉం టుంది. పెద్దప్రేగు క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు స్క్రీనింగ్‌ను ప్రోత్సహించడం, క్యాన్సర్ చికిత్స ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తన నిబద్ధతను మరోసారి తెలియజేసింది.