10 March, 2026 | 11:54 PM

హార్లే డేవిడ్‌సన్, హీరో మోటోకార్ప్ డీలర్ షిప్ విస్తరణ

10-03-2026 10:17 PM

కొచ్చి, మార్చి 10: ప్రముఖ మోటార్ కంపెనీలు హార్లే-డేవిడ్‌సన్ ,హీరో మోటోకార్ప్ దేశవ్యాప్తంగా తమ నెట్ వర్క్ విస్తరణపై దృష్టి సారించాయి. దీనిలో భాగంగా కీలక మెట్రో నగరాల్లో తమ వ్యాపార పరిధిని పెంచుకునేందుకు అడుగులు వేస్తున్నాయి. తాజాగా తమ భాగస్వామ్యంతో కేరళలోని కొచ్చి, కర్ణాటకలోని బెంగళూరులో తమ కొత్త పూర్తి శ్రేణి హార్లే-డేవిడ్సన్ డీలర్‌షిప్‌లను ప్రారంభించినట్లు ప్రకటించాయి. ఈ మైలురాయి భారతదేశంలో హార్లే-డేవిడ్‌సన్ విస్తరణలో ఒక కీలకమైన అడుగుగా పేర్కొన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్ 22 ఫుల్-లైన్ డీలర్‌షిప్‌లకు చేరుకుంది.

ఈ విస్తరణ దేశంలోని ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగానికి ఈ బ్రాండ్ దీర్ఘకాలిక నిబద్ధతగా పేర్కొంటున్నారు. కొత్త డీలర్‌షిప్‌లు భారతదేశంలో పూర్తి హార్లే-డేవిడ్‌సన్ పోర్ట్‌ఫోలియోను విక్రయిస్తాయి. ప్రపంచవ్యాప్తం గా సోర్సింగ్ చేయబడిన కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ మోడళ్లతో పాటు హీరో మోటోకార్ప్ తయారు చేసిన హార్లే-డేవిడ్‌సన్ X440, X440 T, వాటి వేరియంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. అదనంగా, డీలర్‌షిప్ స్టోర్స్ హార్లే-డేవిడ్‌సన్ జెన్యూన్ మర్చండైజ్, యాక్సెసరీస్‌తో పాటు పూర్తిగా 3S అంటే అమ్మకాలు, సర్వీ స్,  స్పేర్స్ కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి; స్థానిక చాప్టర్‌ల ద్వారా హార్లే ఓనర్స్ గ్రూప్ కమ్యూ నిటీ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తాయి.

ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ హార్లే-డేవిడ్‌సన్ బిజినెస్ యూనిట్ హెడ్ రవి అవలూర్ మాట్లాడుతూ హార్లే-డేవిడ్‌సన్, హీరో మోటోకార్ప్ మధ్య భాగస్వామ్యం భారతదేశంలో పూర్తి హార్లే-డేవిడ్‌సన్ విభాగాన్ని అందించే కొత్త ఫుల్-లైన్ డీలర్‌షిప్‌లను ప్రవేశపెట్టడంతో తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి వీలు కల్పించిందన్నారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తి, రిటైల్ అనుభవం, విక్రయానంతర మౌలిక సదుపాయాలతో మద్దతు ఇచ్చే బలమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రీమియం మోటార్‌సైక్లింగ్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమన్నారు.