17 March, 2026 | 10:38 PM

ఉత్తమ ప్రతిభ కనభరచిన అజయ్ కుమార్ రెడ్డికి ఉగాది పురస్కారం

17-03-2026 07:43 PM

చిట్యాల,(విజయక్రాంతి):  ఉగాది పురస్కారాల సందర్బంగా స్నేహల మీడియా పబ్లికేషన్స్  వారి ఆధ్వర్యంలో రైతు రత్న అవార్డు గ్రహీత పజ్జురి అజయ్ కుమార్ రెడ్డిని మంగళవారం  సన్మానించి అవార్డును అందజేశారు. రెడ్డి గర్జన మాసపత్రిక దశమ వార్షికోత్సవం సందర్బంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనభరచిన రెడ్డి సామాజిక వర్గ ప్రముఖులను మేధావులను ఉగాది పురస్కారాల సందర్బంగా స్నేహల మీడియా పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో సన్మానించి అవార్డులు ప్రధానం చేశారు.

సమీకృత వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన రాష్ట్ర రైతురత్న అవార్డు గ్రహీత పజ్జురు అజయ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసి రెడ్డి జాగృతి సంపాదకులు గుర్రం పాపి రెడ్డి, మేనేజిoగ్ డైరెక్టర్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ మల్ రెడ్డి రంగారెడ్డి, నటి వైస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శామల చేతుల మీదుగా సన్మానం మరియు అవార్డు బహుకరించారు.